![]() |
![]() |
అతని వయసు కేవలం 22 సంవత్సరాలు. నటుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అతని ప్రతిభను చూసి దర్శకనిర్మాతలు కూడా అవకాశాలు ఇస్తున్నారు. కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్న అతన్ని మృత్యువు కబళించింది. అతని పేరు అమన్ జైస్వాల్. శుక్రవారం రాత్రి ముంబైలోని జోగేశ్వరి హైవేలో బైక్‌పై వెళుతున్నాడు అమన్. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్ళిన అరగంటకే అమన్ మృతి చెందాడు. ఓ సీరియల్ ఆడిషన్ కోసం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అమన్ ‘ధర్తిపుత్ర నందిని’ సీరియల్ ద్వారా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సోనీ టీవీలో ప్రసారమైన ‘ పుణ్యశ్లోక్ అహల్యాబాయి’ సీరియల్‌లో యశ్వంత్‌రావు పాత్రను అమన్ పోషించారు. 2021లో ప్రారంభమైన ఈ సీరియల్ 2023లో ముగిసింది. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన అమన్ ఆ తర్వాత సీరియల్స్‌తో బాగా పాపులర్ అయ్యాడు. అతను నటుడే కాదు, మంచి గాయకుడు కూడా. అతని మరణం పట్ల టీవీ రంగానికి చెందిన సహ నటీనటులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |